రోడ్డుపై గ్రామస్థుల దర్నా

నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలోని ఎండ్రియాల్ గ్రామానికి రోడ్డు మొత్తం గుంతల మయంగా మారింది. రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది. ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించాలని గతంలో నిధులు కూడ మంజూరయ్యాయి.కానీ పనులు మాత్రం మొదలు కాలేవు.సోమవారం ఎల్లారెడ్డిలొ  మంత్రి కేటిఆర్ బహిరంగ సభ నేపథ్యంలో కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వెల్లే సమయంలో గ్రామస్థులు రోడ్డుపై బైటాయించగా మంత్రి కెటిఆర్ కాన్ వాయి వస్తున్న సమయంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రెడ్డిగారి తిరుపతి రెడ్డి, గడ్డం సాయిబాబు, గ్రామస్థులు భూపతి గౌడ్, గోపాల్ రావు, రాజేశ్వర్, సాగర్, నరెష్, చక్రదర్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.