బీసి కమ్యునిటీ భవనాల ఏర్పాటు చేయాలి

– జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆద్వర్యంలో మంత్రికి వినతి
నవతెలంగాణ- తాడ్వాయి
కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో బిసి కమ్యునిటి భవనాలను ఏర్పాటు, బీబిపేట మండలానికి మంజూరైన జూనియర్ కళాశాలకు బోధన, భోదనేతర సిబ్బందిని మంజూరు చేయాలని కోరుతూ సోమవారం మంత్రి కెటిఆర్ కు బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కాముని సుదర్శన్ వినతిపత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిబిపేట మండలానికి నూతనంగా మంజూరైన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బోధన, బోదనేతర సిబ్బందిని ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిసి బందును లక్ష్య నుంచి ఐదు లక్ష్యలకు , గృహ లక్ష్మి పథకంను మూడు లక్ష్యల నుంచి ఐదు లక్ష్యలకు పెంచాలని కోరుతున్నామన్నారు.అలాగే జిల్లాలోని నాలు నియోజకవర్గాలలో బిసి కమ్యునిటీ భవనాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. ఈయన వెంట బిసి సంక్షేమ సంఘం సభ్యులు పలువురు ఉన్నారు.