ప్రజల బతుకుల మార్పు కోసం పోరాడేది సీపీఐ ఒక్కటే

– సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్విరామంగా పోరాడుతున్న సిపిఐ పార్టీ ఒక్కటేనని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో పర్యటించారు.గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్యుల సేవలు రోగుల సంఖ్య ఆసుపత్రిలో మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఐ నిర్వహించే ప్రజా పోరాటాల ఫలితంగానే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంద పవన్, గడిపె మల్లేశ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేష్,జాగీర్ సత్యనారాయణ, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి,సిపిఐ నియోజకవర్గ నాయకులు తెరాల సత్య నారాయణ, బూడిద సదాశివ, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ,తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి నేలవేణి స్వప్న,  రాజు కుమార్,  ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జెరిపొతుల జనార్దన్ , జంగ విజయ, గుడిపెల్లి రమేష్,  పిట్టల స్వామి తదితరులు పాల్గొన్నారు.