ఆర్మీ వీర జవాన్ ఎర్రం నరసయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి

నవతెలంగాణ- ఆర్మూర్  
ఆర్మీ వీర జవాన్  ఎర్రం నరసయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అబ్బ గోని అశోక్ గౌడ్ సోమవారం డిమాండ్ చేశారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో జన్మించిన ఆర్మీ వీర జవాన్ ఎర్రం నరసయ్య  15వ వర్ధంతి ఆగస్టు 15న నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో చిట్టాపూర్ గ్రామంలో నిర్వహించబడుతుందని .. ఎర్రం నరసయ్య తల్లి తండ్రులు కళావతి  నారాయణ లకు జన్మించిన వీర జవాన్ నర్సయ్య. విధి నిర్వహణలో 2008 ఆగస్టు 15వ తేదీ నాడు మరణించడం జరిగిందని అబ్బగోని అశోక్ గౌడ్ తెలిపారు.2023 ఆగస్టు 15 తేదీకి 15 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో సోమవారం వీర జవాన్ నర్సయ్య ను జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవాన్ ఎర్రం నరసయ్య చిన్న వయసులోనే ఆర్మీ కి వెళ్లి దేశానికి సేవ చేయాలని ఆలోచనతో ముందుకెళ్లాడని కానీ విధి నిర్వహణలో తాను మరణించడం జరిగిందని, దేశం కోసం మరణించడం గొప్ప త్యాగమని అతని జ్ఞాపకాలలో ఇప్పటికీ వీర సైనికుడిగా దేశ సేవలో మధ్యలో బ్రతికి ఉన్నాడని  కొనియాడారు. గత ప్రభుత్వాలు చిట్టాపూర్ గ్రామంలో ఐదెకరాల భూమి మాకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంటి నిర్మాణం కొరకు స్థలాన్ని 300 గజాల  ఫ్లాట్ ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు ఇకనైనా వీర జవాన్ యొక్క సేవలను గుర్తించి మాకు 300 గజాల ప్లాట్ ను ఇప్పించగలరని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి డిఫెన్స్ రాజ్ నాథ్ సింగ్ , మరియు కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా గార్లు ఇండియన్ ఆర్మీలో ఎంతోమంది దేశ సేవ కోసం మరణించిన వాళ్ళని గుర్తించాలని తెలియపరచారు. ఇప్పటికైనా ఎర్రం నరసయ్య కుటుంబ సభ్యులను ఆదుకోవాలని అబ్బ గోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎర్రం నరసయ్య అన్నయ్య ఎర్రం శ్రీనివాస్ సతీమణి జ్యోతి వారి పిల్లలు పిల్లలు ఎర్రం లహరిక, అవాంత్, నడపన్న కీ.శేఎర్రం నరేష్ సతీమణి లక్ష్మి పిల్లలు నయాన, సంజన ,సహన, కుటుంబ సభ్యులు మరియు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షులు దాసరి మూర్తి, కళ్లెం భూమన్న, చిన్నయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.