శ్రీవాణి టెక్నో స్కూల్లో  జెండా పండుగ

నవ తెలంగాణ – సిద్దిపేట
స్థానిక పట్టణం భారత్ నగర్ లోని శ్రీవాణి టెక్నో స్కూల్ లో మంగళవారం ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ యాసాల వెంకట లింగం పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం శ్రీవాణి టెక్నో స్కూల్ కరస్పాండెంట్ సిహెచ్ సత్యం మాట్లాడుతూ మనమందరము ఇతర దేశాల బానిసత్వం నుండి విముక్తులయ్యమని  తెలిపారు. పాఠశాల నిర్వహించిన ఎస్సే రైటింగ్ , వ్యాసరచన , ఆటల పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతి అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరు పాల్గొన్నారు.