ఉత్తమ సేవలకు మంత్రిచే ప్రశంస పత్రాలు అందజేత

నవతెలంగాణ-ఆర్మూర్ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ శంకర్ ,ప్రసాద్ లకు ఉత్తమ సేవలు అందించినందుకు శంకర్  “ఉత్కృష్ట సేవా పతకం” ,ప్రసాద్  “ప్రశంసా పత్రం” లు మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జగదీష్ చందర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు ,ఎస్సైలు అభినందనలు తెలిపారు.