విశ్వకర్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం

నవతెలంగాణ-ఆర్మూర్ 

మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ తిరుమల కాలనీ యందు మంగళవారం విశ్వకర్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో 76వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించినారు. స్థానిక కౌన్సిలర్ ఇట్టే డి నర్సారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేసినారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో పోరాట యోధుల త్యాగాలతో నిర్మితమైన దేశంలో జెండా పండగ నిర్వహించడం అభినందనీయమని నేడు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.