నవతెలంగాణ -ఆర్మూర్
ప్రతి విద్యార్థి తప్పనిసరిగా క్రీడలలో పాల్గొనాలని జిల్లా బేస్ బాల్ అస్సోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని సంక్షేమ పాఠశాల క్రీడా మైదానంలో గురువారం మేజర్ లీగ్ బేస్ బాల్ కప్ ఎంపిక పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించినారు. ఈ సందర్భంగాక్రీడాకారులని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తప్పనిసరి ఉదయం సాయంత్రం క్రీడల్లో పాల్గొనాలి, ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ లో హైదరాబాదులో జరిగే పోటీలలో జిల్లా జట్టు విజయం పొందడానికి కృషి చేయాలి అన్నారు. క్రీడాకారులకు 12,500 రూపాయల విలువగల 50 బేస్బాల్ లు అందజేశారు. క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ దుర్గా రెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరకంగా మానసికంగా అభివృద్ధి పొందడమే కాకుండా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు.భవిష్యత్తులో ఏ విజయం సాధించాలన్నఆరోగ్యం గా ఉండాలిఆరోగ్యంగా ఉండాలంటే క్రీడల్లో పాల్గొనాలి అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బి మల్లేష్ గౌడ్, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, ఉపాధ్యాయులు స్వామి, గంగాధర్, రవి రాయుడు, శ్రీరాములువ్యాయామ ఉపాధ్యాయులు రాజేందర్, ప్రవీణ్, జోష్ణ భాగ్య, పూజ మరియు సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ లు ఇట్యాల నరేష్, వేముల మౌనిక తదితరులు పాల్గొన్నారు.