200 స్టోర్లకు విస్తరించిన అసుస్‌

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ అసుస్‌ ఇండియా 200 స్టోర్లకు విస్తరించినట్లు ప్రకటించింది. న్యూఢిల్లీలోని నెహ్రు ప్యాలెస్‌ వద్ద కొత్త స్టోర్‌ను తెరవడం ద్వారా ఈ మైలురాయికి చేరినట్లు తెలిపింది. వినియోగదారులకు కావాల్సిన పిసిలు, గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లు, ఆల్‌ ఇన్‌ ఒన్‌ డెస్క్‌టాప్‌లు, ఇతర యాక్ససరీలను ఇక్కడ ప్రదర్శన, అమ్మకానికి ఉంచినట్లు అసుస్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌ అర్నాల్డ్‌ సు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా తమ రిటైల్‌ కార్యక్రమాలను వృద్థి చేయడంతో పాటుగా భారతీయ మార్కెట్‌ పట్ల బ్రాండ్‌ నిబద్ధతను సైతం వెల్లడిస్తుందన్నారు. దేశంలో అసుస్‌ 2020లో 50 స్టోర్లను మాత్రమే కలిగి ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 200కు చేరిందన్నారు.