అరుణాచలం పుణ్యక్షేత్రానికిటీఎస్ ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ…

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
అరుణాచలం పుణ్యక్షేత్రాన్ని దర్శించు కునేందుకు వెళ్లే భక్తులు, ప్రయాణీకులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. అమావాస్య రోజును పురస్కరించు కుని పవిత్ర పుణ్యక్షేత్రమైన గాను ఇటీవల స్పెషల్ ప్యాకేజీ ప్రవేశపెట్టిన టీఎస్ ఆర్టీసీ, ఆగస్ట్ 31వ తేదీన రాఖీ పౌర్ణమి పండుగను దృష్టిలో ఉంచుకుని భక్తులు, ప్రయాణీకులకు మరో స్పెషల్ ప్యాకేజీని తీసు కువచ్చినట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఎ శ్రీధర్ తెలిపారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఈ నెల 30వ తేదీ రాత్రి 9 గంటలకు మహా త్మాగాంధీ బస్ స్టేషన్ నుండి బస్సు బయలుదేరి మరుసటి రోజు 31వ తే దీన కాణిపాకం విఘ్నేశ్వరుడి దర్శనం అనంతరం అదే రోజు సా యంత్రం వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం రాత్రి 9 గంటల కు అరుణాచలం చేరుకుంటుందని, మరుసటి రోజు అక్కడ దర్శనం అనంతరం సాయంత్రం 6 గంటలకు బలయుదేరి ఆగస్ట్ 2వ తేదీ ఉద యం హైదరాబాదు చేరుకుంటుందని తెలిపారు. ఈ ప్యాకేజీలో అరుణాచలం ఆలయాలనికి వెళ్లే భక్తులు ముందస్తుగా తమ సీట్లను రిజర్వు చేసుకోవాలని . ఇతర వివరాలకు 9959226257/ 9959224911/ 9959226246 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.