నేను చేసే పాత్రలు నన్నే సర్‌ప్రైజ్‌ చేయాలి

I do the roles I am a surprise should be doneదుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్‌ఎంటర్‌టైనర్‌ ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి అభిలాష్‌ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 24న విడుదల కానున్న నేపథ్యంలో హీరో దుల్కర్‌ సల్మాన్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే..
‘కింగ్‌ ఆఫ్‌ కొత్త .. ఇందులో కొత్త అంటే మలయాళంలో టౌన్‌ అని అర్ధం. అదొక ఫిక్షనల్‌ టౌన్‌. ఇప్పటి వరకు నేను గ్యాంగ్‌ స్టార్‌ సినిమాలు చేయలేదు. స్కేల్‌ పరంగా ఇది బిగ్గెస్ట్‌ మూవీ. పాటలు, యాక్షన్‌ సీక్వెన్స్‌, ఫుట్‌ బాల్‌ .. ఇలా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఇందులో చాలా ఉన్నాయి.
ఇలాంటి సినిమా చేయడం నాకు పూర్తిగా కొత్త. ఇదొక మంచి గ్యాంగ్‌స్టర్‌ డ్రామా. అలాగే మంచి ఫ్రెండ్‌షిప్‌ కూడా ఉంటుంది. నాకు హ్యూమన్‌ డ్రామా, సంఘర్షణ ఇష్టం. అది ఇందులో చక్కగా కుదిరింది. కథ రెండు పీరియడ్స్‌లో ఉంటుంది. అలాగే ఇందులో ఫుట్‌బాల్‌ సీక్వెన్స్‌లు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ద్రువ్‌ అనే యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ ఆ సన్నివేశాలని చాలా అద్భుతంగా డిజైన్‌ చేశారు. విజువల్‌గా చాలా కొత్తగా ఉంటాయి. ఇందులో ప్రతి పాత్ర కథని మలుపు తిప్పుతుంది.
ఈ సినిమాకి తమిళం, తెలుగు, మలయాళం హిందీలోనూ నేనే డబ్బింగ్‌ చెప్పాను. ఈ సినిమా దర్శకుడు నాకు చైల్డ్‌ హుడ్‌ ఫ్రెండ్‌. ఎప్పటి నుంచో కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నాం. ఫైనల్‌గా ఈ కథ కుదిరింది. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌కి వచ్చి చూసే విధంగా ఈ సినిమాని భారీగా రూపొందించాం.
‘సీతారామం’ తర్వాత నాకు పూర్తిగా లవర్‌ బారు ఇమేజ్‌ వచ్చింది ఇలాంటి గ్యాంగ్‌ స్టార్‌ సినిమా చేయడం ఎలా అనిపించిందని అందరూ అడుగుతున్నారు. నేను ఎక్కువగా లవర్‌ బారుగా గుర్తుంటాను ( నవ్వుతూ). నాకు నచ్చిన కథని చేస్తాను. అయితే ఒకే రకం కథలు, పాత్రలు చేయాలని మాత్రం ఉండదు. ప్రేక్షకులతో పాటు ఒక నటుడిగా నాకు నేను సర్‌ప్రైజ్‌ అయ్యే పాత్రలు చేయాలని ఉంటుంది. అందులో నుంచి దీనికి షిఫ్ట్‌ అవ్వడం ఎగ్జైటింగ్‌గా ఉంది.
‘ప్రాజెక్ట్‌ కె’ పై మీడియా వేసే ప్రశ్నలను ఎవైడ్‌ చేస్తున్నాను ( నవ్వుతూ). వారే చెప్పాలి. అయితే ఆ సినిమా.. ఇండియన్‌ సినిమా ల్యాండ్‌ స్కేప్‌ని మార్చేస్తుంది. ఇప్పటివరకూ చాలా సినిమాలు విన్నాను, చూశాను. కానీ అలాంటి సినిమాని ఎవరూ తీయలేదు.
– దుల్కర్‌ సల్మాన్‌