అన్నా తమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు ఆనందాన్ని కలిగించే నాగ పంచమి పండుగ

– పుట్టపాలతో అన్నా తమ్ముళ్లకు కళ్ళు కడిగిన అక్కా చెల్లెలు

– ఇంటి దర్వాజలకు ప్రత్యేక పూజలు
నవతెలంగాణ- మద్నూర్
అన్నా తమ్ముళ్లకు అక్కాచెల్లెళ్లకు ప్రత్యేకంగా ఆనందాన్ని కలిగించే పండుగ నాగపంచమి పండుగ ఈ పండుగా రోజు ఆడబిడ్డలు మెట్టింటి నుండి పుట్టింటికి వస్తారు నాగపంచమి పండుగకు ప్రత్యేకంగా మహిళలు నాగదేవతకు అలాగే పుట్టకు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆవు పాలతో పసుపు కుంకుమ జొన్న ప్యాలాలు పత్రి ఆకు పత్తి వస్త్రాలు జంజనములు వీటితో ప్రత్యేక పూజలు నిర్వహించిన పుట్టపాలతో ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా ఇంటి దర్వాజలకు పసుపు కుంకుమ పత్రి జొన్న ప్యాలాలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్క చెల్లెలు అన్న తమ్ముళ్లకు పుట్టకు ప్రత్యేకంగా పూజించిన ఆవుపాలతో కండ్లు కడిగారు కండ్లు కడిగిన అక్కాచెల్లెళ్లకు అన్న తమ్ముళ్లు నూతన వస్త్రాలు అందజేసి కాళ్లు మొక్కి అక్కా చెల్లెళ్ల ద్వారా ఆశీర్వాదాలు పొందారు. నాగపంచమి రోజు ప్రతి ఇంటి కుటుంబీకులు తాలుకల పాశంతో ప్రత్యేక భోజనాలు చేశారు. మద్నూర్ మండలంలో సోమవారం నాడు నాగపంచమి పండుగను ప్రజలంతా ఉత్సాహంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి.