పలువురికి ఇందిరమ్మతో బుట్టు బాండ్లు పంపిణీ 

నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 
దుబ్బాక మండల పరిధిలోని రాజక్కపేట్ గ్రామానికి చెందిన కొరివి శిరీష పర్శారాములు, అలాగే చీకోడ్ గ్రామానికి చెందిన పల్లంపల్లి లావణ్య శ్రీధర్ దంపతులకు ఆడబిడ్డలు జన్మించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ ఆదేశాల మేరకు మంగళవారం వారిని కలిసి ఇంద్రమ్మ తోబుట్టు కార్యక్రమంలో భాగంగా టీం కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆడబిడ్డకు బేబీ కిట్, బేబీ డ్రెస్, 5000/- రూపాయల పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంద్రమ్మ తోబుట్టు కార్యక్రమం ఆడపిల్ల బరువు కాదు, బహుమానమని అన్నారు.ఈ కార్యక్రమంలో కొత్త దేవి రెడ్డి (దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్), బాల్ రెడ్డి, మిద్దె భూపాల్ గౌడ్ (సిద్దిపేట జిల్లా సేవాదళ్ కార్యదర్శి),అశోక్ గౌడ్,ఐరేని సాయితేజ గౌడ్, యాదగిరి , మల్లేశం, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.