
తెలంగాణలో అవినీతి అరాచక పాలన కొనసాగుతుందని మహారాష్ట్ర వాణి నియోజకవర్గం ఎమ్మెల్యే సంజీవరెడ్డి బాబురావు అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో బాగంగా మండలంలోని పిప్రి గ్రామంలో మంగళవారం మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాల నాయకులు మెచ్చుకుంటూ పొగుడుతున్నారు అని తెలంగాణ లో మాత్రం అరాచక పాలన అవినీతి పాలన కొనసాగుతుంది అని ఆర్మూర్ లో చూస్తే బయనక వాతావరణం ఉంది అని ఇక్కడి ప్రజాప్రతినిధి పేరు చెప్తే అధికార పార్టీ నాయకులు సైతం భయపడుతున్నారు అని అందుకే బీజేపీ గెలుస్తే శాంతి పాలన ఉంటుంది అని అన్నారు.బీజేపీ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా ఉండాలని కార్యకర్తల కలిసి బీజేపీ గెలుపుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ పల్లె గంగారెడ్డి అదిలాబాద్ ఇన్చార్జి శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు పైడి రాకేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి నియోజకవర్గ నాయకురాలు విజయభారతి, అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, చొప్పదండి ప్రబారి అందాపూర్ రాజేష్, కిసాన్ జిల్లా అధ్యక్షుడు నూతల శ్రీనివాస్ రెడ్డి, బీజేవైo మండల అధ్యక్షులు నరేష్ చారి, మండల ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.