నవతెలంగాణ- డిచ్ పల్లి
త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ను మరోసారి ఎంపికై నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికి అక్కడి నుండి వాహన ర్యాలీ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, బిఅర్ఎస్ మండల ఉధ్యక్షులు చిలివెరి గంగా దాస్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వెర్వేరుగా పంపిన ప్రకటన లో మంగళవారం తెలిపారు. రూరల్ నీయోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పిటిసిలు, వైస్ ఎంపీపీలు, ఎంపిటిసిలు, సర్పంచులు, ఉపసర్పంచులు, సొసైటీ చైర్మన్లు, సొసైటీ డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఉదయం 11:00 గంటలకు ఇందల్వాయి టోల్ ప్లాజా నుండి నిజామాబాద్ జిల్లా వరకు వాహనాల ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు.