
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ ల అసోసియేషన్ హుస్నాబాద్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా డి.వసుమతి, ఉపాధ్యక్షురాలుగా డి పద్మ, కోశాధికారిగా జయలక్ష్మి, కార్యదర్శిగా ఎల్ సుజాతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీని టీఎన్జీవో కు అనుబంధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్ హుస్నాబాద్ అసోసియేషన్ అధ్యక్షులు బి. పరుశురాం, జే. రవీందర్ రావు, సెక్రటరీ జి. మోహన్, ట్రెజరర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు లలిత, జాయింట్ సెక్రెటరీ చంద్రకళ, రవీందర్, సభ్యులు రేణుక మునిందర్, అంగన్వాడి టీచర్ అండ్ హెల్పర్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు అంబామ్మ, జిల్లా కార్యదర్శి పుష్ప, జిల్లా ప్రాజెక్టు అధ్యక్షులు బి శైలజ, జిల్లా కమిటీ సభ్యులు పద్మ, కృష్ణవేణి, విజయశ్రీ అంగన్ వాడి టీచర్లు హెల్పర్లు పాల్గొన్నారు.