గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి

Screening of Grilahakshmi applications should be completed– వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి శుక్రవారం వరకు ఆన్‌లైన్‌లో డాటా ఎంట్రీ పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఓటర్‌ జాబితా నమోదు, గృహలక్ష్మి, హరితహరం తదితర అంశాలపై తహసీల్దార్లు, ఎంపీడీలతో అదనపు కలెక్టర్లు రాహుల్‌ శర్మ, లిగ్యా నాయక్‌లతో కలిసి వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా తీసుకున్న గృహలక్ష్మి పథకం కింద గుర్తించిన లబ్దిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
ఈనెల 26 చేపట్టే మెగా ప్లాంటేషన్‌ కార్యక్రమా న్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశిం చారు. హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటే షన్‌పై దృష్టి సారించాలన్నారు.
జిల్లాలో మంజూరైన 269 గ్రామపంచాయతీ భవనాలను పనులను వేగవంతం చేసేందుకు గాను వారం రోజుల్లోగా బేస్మెంట్‌ వరకు పనులు జరిగేలా చూడాలన్నారు. ఇంకా అదనంగా గ్రామ పంచాయతీ భవనాలకు ప్రతిపాదనలు వచ్చినట్లయితే పరిపాలన పరంగా మంజూరు చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. గ్రామపంచాయతీ భవనాలు సెప్టెంబర్‌ 30లోగా ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉండాలని పంచాయ తీరాజ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.
దళిత బంధుకు మొదటి ప్రాధాన్యతనిస్తూ జాబితాలు అందిన ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి ఆన్లైన్‌ లో డాటా ఎంట్రీ చేయాలని సూచించారు.
18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని తహసీల్దార్లకు సూచిం చారు. బూత్‌ స్థాయి అధికారుల నియామకాన్ని వెంటనే చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. ప్రభుత్వం కులవృత్తులపై ఆధారపడ్డ కుటుంబాలకు అందించే ఆర్థిక సాయం జాబితాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ కృష్ణన్‌, అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్‌, బీసీడీఓ ఉపేందర్‌, పంచాయతీరాజ్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి సుధారాణి, వికారాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.