
కీటక జనిత వ్యాధుల నివారణ అవగాహన కార్యక్రమ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించినారు విద్యార్థులందరికీ పట్టణ ఆరోగ్యశాఖ తరఫున వర్షాకాలంలో సంభవించు దోమల వల్ల వచ్చే వ్యాధులు డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికెన్ గునియా, మెదడువాపు ,వంటివి ,ఇతర అంటు వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ,వర్షాకాలంలో మన ఇంటి చుట్టూ పరిసరాలలో నీటి నిల్వలు ఏర్పడి అందులో దోమలు వృద్ధి చెంది పై వ్యాధులు సంభవిస్తాయి, కాబట్టి ఇంటి పరిసరాలలో పాత బకెట్లు, కూలర్లు, కొబ్బరి బొండాలు ,ఇతర పాడైన వస్తువులన్నింటినీ ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి, అలాగే దోమలు వ్యాపించకుండా దోమతెరలను, మస్కిటో కాయిల్స్ ,ను రిపేల్లెంట్ ,లను వాడాలని పట్టణ ఆరోగ్య పర్యవేక్షకుడు చంద్రశేఖర్ తెలిపారు,,,ఈ కార్యక్రమంలో బాలుర ఉన్త పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత , పట్టణ వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి ,హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, ఉపాధ్యాయులు మల్లేష్ ,నరహరి ,రాజు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.