
మండలంలోని పండు వారి గూడెంలో నాబార్డ్ నిధులతో నిర్మించిన జీవ వనరుల కేంద్రాన్ని నాబార్డ్ సీజీఎం సుశీల చింతల బుదవారం ప్రారంభించారు.
మల్లాయిగూడెం జీవ కమిటీ, వాసన్ ఆధ్వర్యంలో లో గోమూత్రం,గోవు పేడ,పుట్ట మట్టి,పప్పుదినుసులు పిండి, నీరు లను మిశ్రమంతో జీవామృతం చేసే యూనిట్ ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. సేంద్రీయ సాగు ఆరోగ్యవంతమైన వ్యవసాయం మని, దిశగా రైతులు ఆలోచన చేయాలన్నారు.ప్రతీ రైతు ఈ సాగు వైపు మారిపోతే అశ్వారావుపేట ఐశ్వర్య పేట గా మారుతుందన్నారు.ప్రతి రైతు ఒక వైద్యులు మారి మంచి ఆరోగ్యం అందించాలన్నారు. భూమికి పోషకాలు అందించి ఆరోగ్యవంతమైన నేల గా మార్చాలని సూచించారు.ఈ ప్రాంత నెలలు సారవంతం మైన నెలలు అని అన్ని రకాల పంటలకు అనువుగా ఉన్నాయి అన్నారు.నేలను కాపాడు కుంటే ముందు తరాల పిల్లలు భవిష్యత్ మంచిగా ఉంటుందని.నాటి మన పూర్వీకుల ఆరోగ్యం,నేటి మన ఆరోగ్యం ఎలా ఉందో మనకు తెలుసు.భవిషత్ లో ముందు తరం వారి పరిస్థితి గురించి ఆలోచించాలని రైతులకు చుసించారు.ప్రకృతి వ్యవసాయం చేసి పంట మార్పిడి తీసుకు వస్తారనే నమ్మకం కలిగిందన్నారు. అంతరం గవర్నర్ దత్తత గ్రామమైన గోగులుపుడి కొండారెడ్డి లకు పిండి మిల్లు పంపిణీ చేశారు.మొక్కలు నాటారు.దేశీయ విత్తనాలు, ఆర్గానిక్ కూరగాయలు,వ్యవసాయ పనిముట్లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం లో డీ.జీ.ఎం శ్వేత సింగ్,ఉభయ జిల్లాల నాబార్డ్ అధికారి సుజిత్ కుమార్,వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ వెంకన్న, రెడ్డి ప్రియ,వాసన్ ప్రతినిధి సతీష్ కుమార్,దార ప్రసాద్, కొర్రి మల్లయ్య, రాము, దుర్గారావు, ఆర్ పి పేరుబోయిన శ్రీను, బాబుల్ రెడ్డి,దుర్గ రెడ్డి,సీత, ముత్యాలు, కన్నం రాజు, మరో 32 మంది రైతులు పాల్గొన్నారు.