అన్నపూర్ణ స్టూడియోస్, చారు బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ను తెలుగులో ‘బార్సు హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్నారు. నితిన్ కష్ణమూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత సుప్రియ యార్లగడ్డ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ట్రైలర్ చూడగానే నవ్వొచింది. దీన్ని ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు అందించాలని అనుకున్నాం. అలాగని దీన్ని రీమేక్ చేయలేం. అందుకే డబ్బింగ్ చేశాం. ఇదొక జారు రైడ్. ఆ ఎనర్జీ, మ్యాజిక్‌ని రీ క్రియేట్ చేయలేం. అలాగే చారు బిస్కట్ ఫిలిమ్స్ మంచి వైబ్ తో వుంటారు. చాలా చక్కగా చేస్తున్నారు. ఓనర్షిప్ వుంటే రిజల్ట్ ఎలా వున్నా జర్నీ బావుంటుంది.
ఒరిజినల్ సినిమాలో రమ్య చేసిన పాత్రకు తెలుగులో రష్మి పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో చాలా హాట్‌గా కనిపిస్తారు. తన పాత్రతో సినిమాకి మరింత నేటివిటీ వచ్చింది. మనదంటూ ఒక ఫ్లేవర్ యాడ్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో, రైటింగ్ సైడ్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.
నాగార్జున 100 సినిమాకి స్పెషల్‌గా ప్లాన్ చేస్తున్నారా అని అందరూ అడుగుతున్నారు. అయితే ఈ ప్రశ్నని ఆయననే అడగాలి. నేను ఏదైన చెప్తే నాకు పడతాయి (నవ్వుతూ). అలాగే చైతు, అఖిల్‌తో ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్‌లో నటన స్టార్ట్ చేయలేదు. యాక్టింగ్ వచ్చా రాదా? అని చెక్ చేసుకోవడానికి ‘గూఢచారి’ చేశాను. ‘గూఢచారి 2’ లో నా పాత్ర ఉంటే చేస్తా.