‘గాండీవధారి అర్జున’లో ఏదో సందేశం ఇచ్చి, మీరు మారాలని చెప్పటం లేదు. ఇప్పుడున్న సమస్య ఏంటి? అనే దాన్ని చూపిస్తున్నాం. దాని వల్ల ఎవరైన మారితే మంచిదే. నేను రీసెంట్‌గా సినిమాను చూశాను. నాకు బాగా నచ్చింది’ అని చెప్పారు కథానాయకుడు వరుణ్‌తేజ్. ఆయన హీరోగా నటించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాని ఈనెల 25న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘ప్రవీణ్ సత్తారు కాన్సెప్ట్స్‌లో సెన్సిబిలిటీస్ ఉంటాయి. ‘గని’ సినిమా షూటింగ్ సమయంలో తను ఈ కథ చెప్పాడు. అయితే ఈ కథలో తను మాట్లాడాలనుకున్న ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా పెద్దదని నాకు ఓ యంగస్టర్‌గా తెలుసు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ వల్ల ఆ సమస్యను ఎవరం పట్టించుకోం. అది వెంటనే మనపైన ప్రభావం చూపేది కాదు. దాని ఎఫెక్ట్ కొన్నేళ్ల తర్వాత ఉంటుంది. ప్రవీణ్ చెప్పినప్పుడు కథలోని మెయిన్ పాయింట్, ఎమోషన్స్ నచ్చాయి. నటుడికి ఓ సామాజిక బాధ్యతాయుతమైన పాత్రల్లో నటించే సినిమాలు తక్కువగానే వస్తుంటాయి. మంచి కథతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా ఉండే సినిమా చేయటం నాకు బావుంటుందని పించింది. నాయిక సాక్షి వైద్య చాలా బాగా నటించింది’ అని చెప్పారు.