చదువుతో పాటు క్రీడలు అవసరమే: సురేష్ బాబు

నవతెలంగాణ-  ఆర్మూర్
విద్యార్థుల దైనందిన జీవితంలో చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమేనని ,క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజమని పట్టణ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు అన్నారు. పట్టణంలోని మామిడిపల్లి విజయ్ హై స్కూల్ యందు గురువారం ఇంట్రామ్యు రల్ గేమ్స్, స్పోర్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అత్యంత చక్కగా మార్చి ఫస్ట్ చేసిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయ్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అమృతలత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.