నవతెలంగాణ – శంకరపట్నం
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, రాష్ట్రప్రజా సంఘాల జేఏసీ సంఘం అధ్యక్షులు గజ్జల కాంతం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా శంకరపట్నం మండలం ధర్మారం గ్రామానికి చెందిన దేవునూరి కిష్టయ్య, కేశవపట్నం గ్రామానికి చెందిన బొజ్జ రవిని జిల్లా ఉపాధ్యక్షుడిగా, కరీంపేట గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాసుని మానకొండూరు నియోజకవర్గం అధ్యక్షునిగా, మెట్పల్లి గ్రామానికి చెందిన అంతడ్పుల సతీష్ ని మండల అధ్యక్షునిగా, తాడికల్ గ్రామానికి చెందిన ఆరేపల్లి ఓదెలును మండల ప్రధాన కార్యదర్శిగా గురువారం జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్ శంకరపట్నం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అణ గారిన తాడిత పీడిత దళిత గిరిజన మైనార్టీ ప్రజలను అనుగదొక్కేందుకు బిజెపి, ఆర్ఎస్ఎస్ పన్నుతున్న వ్యూహాలను తిప్పికొట్టేందుకు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం బలోపేతం చేస్తున్నామన్నారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యదర్శి దేవనూరి కిష్ణయ్య, మాట్లాడుతూ తమ శక్తివంచన లేకుండా సంఘం బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.