
అశ్వారావుపేట(వినాయకపురం) ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మలేరియా ప్రభావిత గ్రామాలైన సుద్ద గోతులు గూడెం,కొత్త రెడ్డి గూడెం లలో దోమల నివారణ మందు ఏ.సీ.ఎం ను పిచికారీ చేసారు.ప్రజలు బాగాస్వాములై ప్రతి గృహం లోపల,బయట 100% పిచికారి చేయించుకోవాలి అని సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు కోరారు.ఇచ్చిన దోమతెగలు సక్రమంగా వాడుకోవాలని, ఇంటి పరిసరాల నీటి నిల్వలు లేకుండా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హెచ్.ఇ.ఒ రాజు,హెచ్.ఎస్ శ్రీ నివాస్,ఎం.టి.ఎస్ విజయారెడ్డి, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ,గోపాల్, క్రిష్ణ వేణి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.