సిద్ధిపేట అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం..

– గూడూరి శ్రీనివాస్ ధరఖాస్తు
నవ తెలంగాణ – సిద్దిపేట 
పిసిసి చేనేత విభాగం ఛైర్మెన్ గూడూరి శ్రీనివాస్ సిద్ధిపేట అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం  ధరఖాస్తు చేసుకున్నారు.  శుక్రవారం గాంధీభవన్ లో  పిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు దరఖాస్తు అందచేశారు.  పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గూడూరి శ్రీనివాస్ గత 25 ఎండ్లుగా కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు. సిద్దిపేట మార్కెట్ కమిటీ  చైర్మన్ గా పనిచేశారు. నియోజవర్గంలో  కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. గత పదేండ్లు గా పిసిసి చేనేత విభాగం ఛైర్మెన్ గా పనిచేస్తూ..పద్మశాలి ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశారు. సిద్దిపేట లో సైతం పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు అధికంగా ఉండటం ఆయనకు కలసివచ్చే అవకాశం వుంది.  కాంగ్రెస్ అధిష్టానం  సైతం గూడూరు శ్రీనివాస్ కు మొగ్గు చూపే అవకాశం ఉందిని తెలుస్తున్నది. ఈ సదర్భంగా గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు కాంగ్రెస్ టికెట్ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. తనకు అవకాశం వస్తే పార్టీ విజయానికి కృషి చేస్తా అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి, విధేయుడు గా పనిచేస్తా నని హామీ నిచ్చారు.