రోడ్డు ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు

నవతెలంగాణ- తాడ్వాయి
ఏజెన్సీలో రోడ్డు ప్రమాదాల నివారణకు ములుగు ఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు శుక్రవారం పస్రా నుండి తాడ్వాయి మధ్యలో 163 వ జాతీయ రహదారిపై ఇరువైపులా ఉన్న చెట్లకు ములుగు డి.ఎస్.పి ఎన్ రవీందర్, పస్రా సిఐ శంకర్, స్థానిక ఎస్సై ఓంకార్ యాదవ్ లు ఎరుపు రంగు గల రేడియం స్టిక్కర్లను అమర్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాత్రి వేళల్లో వాహనాలు 163 జాతీయ రహదారిపై అతివేగంగా ప్రయాణించి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాలు తగ్గించడానికి రోడ్లకి ఇరువైపులా ఎరుపు రంగులో రేడియం తో కూడిన స్టిక్కర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రక్షణ ఏర్పాట్ల వల్ల జాతీయ రహదారిపై కొంతమేర ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.