దేశానికి మాయని మచ్చ కేజ్రీవాల్‌

–  అన్నాహజారే స్పందించాలి
– భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అవినీతిని ఊడ్చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్‌ లిక్కర్‌ స్కాములకు పాల్పడి దేశానికి మాయని మచ్చ తెచ్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. దీనిపై అన్నాహజారే స్పందించాలని డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ నిర్ణయానికి అక్కడి సీఎం కేజ్రీవాల్‌ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈడీ నోటీసులిస్తే సమగ్ర విచారణకు వెళ్లాల్సిన కవిత, అది తెలంగాణ ప్రజలకు అవమానమని వ్యాఖ్యానించడాన్ని భట్టి ఖండించారు. లిక్కర్‌ స్కామ్‌కు తెలంగాణ సమాజానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. తాను 16 నుంచి పాదయాత్ర చేస్తానని, ఆదిలాబాద్‌ నుండి ఖమ్మం వరకు ఉంటుందని తెలిపారు.