దసరా కానుకగా రిలీజ్‌

శివరాజ్‌ కుమార్‌ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఘోస్ట్‌’. శ్రీని ఘోస్ట్‌ దర్శకుడు. పొలిటీషియన్‌, నిర్మాత సందేశ్‌ నాగరాజ్‌ తన సందేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 19న దసరా కానుకగా విడుదల చేయనున్నారు. రిలీజ్‌ డేట్‌ని ఆకట్టుకునే పోస్టర్‌తో మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ఆకట్టుకునే ప్రచార చిత్రాలతో పాటు, ఇటీవల బ్లాక్‌బస్టర్‌ ‘జైలర్‌’లో శివన్న పాత్రకు వచ్చిన ట్రెమండస్‌ రెస్పాన్స్‌ ఈ సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. ఇతర భాషల్లో ‘ఘోస్ట్‌’ రైట్స్‌ కోసం పెద్ద పెద్ద బ్యానర్‌ల నుండి ఆఫర్స్‌ వస్తున్నాయి. చిత్ర బందం అక్టోబర్‌ రెండవ వారం నుండి దేశవ్యాప్తంగా స్పెషల్‌ ప్రీమియర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అలాగే సెప్టెం బర్‌ రెండవ వారంలో ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తున్నారు.అనుపమ్‌ ఖేర్‌, జయరామ్‌, ప్రశాంత్‌ నారాయణ్‌, అర్చన జాయిస్‌, సత్య ప్రకాష్‌, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళం భాషల్లో అక్టోబర్‌ 19న దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.