పరాక్రమంబిఎస్‌కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘పరాక్రమం’. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సెప్టెంబర్, అక్టోబర్‌లో రెండు షెడ్యూల్స్‌లో ముప్పై రోజులో షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ, ‘కళ నాది. వెల మీద” అనే కాన్సెప్ట్‌తో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేసిన ‘నిర్బంధం, మాంగల్యం’ లాంటి కల్ట్ సినిమాలతో నాకు లక్షలాది ప్రేక్షకుల అభిమానం లభించింది. వాళ్ళు ఇచ్చిన బలంతో ఇప్పుడు ‘పరాక్రమం’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నాను. ‘ఐ, మీ, మై సెల్ఫ్’ అనేది దీని టాగ్ లైన్. గోదావరి జిల్లాలోని లంపకలోవ గ్రామంలో పుట్టిన లోవరాజు అనే యువకుడి జీవితంలో జరిగే గల్లీ క్రికెట్, ప్రేమ, నాటక రంగ జీవితం, రాజకీయం లాంటి ఘట్టాల ఆవిష్కరణే ఈ చిత్ర ముఖ్య కథాంశం. యువతను అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేస్తూనే, వారిని మేల్కొలిపే ఒక మంచి కమర్షియల్ కథతో రాబోతున్నాను. ఇందులో కొత్త నటీనటులను పరిచయం చేయబోతున్నాను’ అని తెలిపారు.