
ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు, ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాడ్వాయి తహసీల్దార్ కార్యాలయం ముందు శనివారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు జాటోత్ రాధ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో ఆషాలకు భారీగా వేతనాలు ఇస్తున్నామని చెబుతూ ఆచరణలో పారితోషికాలే ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన కరోనా రిస్క్ అలవెన్స్ తన ఖాతాలో వేసుకుంది కానీ విడుదల చెయ్యటానికి చేతులు రావటం లేదు అన్నారు. ఆరు నెలల పి ఆర్ సి ఏరియర్స్ ఇవ్వాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఫిక్స్డ్ వేతనం రూ.10000 అమలు చేస్తున్నారు. కేరళ రాష్ట్రలో 18000/- ఇస్తున్నారు. ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో కనీసం ప్రమాద భీమా సౌకర్యం పొందలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది. కంటి వెలుగు,లెప్రసీ,మలేరియా, టిబి సర్వే ల బిల్లులు చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశాలు మధురాణి, పుష్ప, సులోచన, నాగమణి, కవిత, మాధవి, రజిత, సుధ, జాన్సీ, రాణి తదితరులు పాల్గొన్నారు.