ఆరోగ్యశ్రీ,అయుష్మాన్ భారత్ లతో రాబోతోంది పోందాలి..

నవతెలంగాణ -డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బి సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల (ప్రతిభ) పాఠశాల, కళాశాలలో శనివారం ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ కు చెందిన సిబ్బంది లిల్లీ పుష్పా, స్టాఫ్ నర్స్ కవిత సందర్శించి ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి సంగీత తెలిపారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పథకాన్ని తెల్ల రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కలిగిన వారు ఈ పథకం ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంభానికి రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందవచ్చని పేర్కొన్నారు. ప్రధానంగా ఈ పథకంలో 1657 రకాల జబ్బులకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యసేవలను పొందవచ్చని ఈ విషయాన్ని విద్యార్థినులు తమ కుటుంభ సభ్యులకు తెలిపి లాబ్ది పోందలని సూచించారు. మరింత సమాచారం కొరకు 9652865641, 8333817062 & 8333817038 లలో సంప్రదించాలని కోరారు.