కాళోజి వాడిలో డీజే దొంగతనం కేసు నమోదు

నవతెలంగాణ- తాడ్వాయి
కాళోజివాడి గ్రామంలో డీజే చోరీకి గురైనట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామానికి చెందిన ముస్కు రవికుమార్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఫంక్షన్ ఉండగా డీజే పెట్టి  రాత్రి ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం 25 న ఫంక్షన్ హాల్ కి వెళ్లి చూడగా డీజే కనపడలేదు. దీని విలువ రూ.1 90 లక్షల ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఈ విషయమై బాధితుడు ముసుగు రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు