యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో 1న హైదరాబాద్‌లో మహాధర్నా

– ఉపాధ్యాయులు విజయవంతం చేయాలి
– టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కే. జంగయ్య
– శంషాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు
– సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌
నవతెలంగాణ-శంషాబాద్‌
తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యంత నిరాధరణకు గురైతున్నది విద్య మాత్రమేనని తెలంగాణ టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కే.జంగయ్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల విద్య వ్యతిరేకులుగా మా రారని విమర్శించారు. ఆదివారం యూఎస్‌పీసీ సమా వేశం శంషాబాద్‌లోని ఎమ్మార్సీ కార్యాలయంలో నిర్వహిం చారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నా రు. బదిలీలు, పదోన్నతుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. రెండు నెలల సమయంలో డీ ఎస్సీ ప్రకటన చేశారని కేవలం ఐదు వేల పై చిలుకు పో స్టులను మాత్రమే డీఎస్సీ టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 2014 కంటే ముందు 20 వేల పోస్టులు ఉంటే 2023లో కూడా 22వేల పోస్టులు మాత్రమే చూపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 60 లక్షల విద్యార్థులకు గాను 28 లక్షల మంది విద్యార్థుల జీవితాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014కు ముందు 300 గురుకులాలు ఉంటే 2023 నాటికి వెయ్యి కి పెంచారని అయితే అందులో ఆరు లక్షల మంది మా త్రమే చదువుతున్నారని తెలిపారు. మిగతా 30 లక్షల మం ది ప్రయివేట్‌లో చదివితే 28 లక్షల మంది ప్రభుత్వ పాఠ శాలలో చదువుతున్నారని వివరించారు. స్కావెంజర్స్‌, ఉ పాధ్యాయుల కొరతతో పాఠశాలలు నిర్వీర్యం అవుతు న్నాయని అన్నారు. కమీషన్లు వచ్చే వాటిపైనే ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని విమర్శించారు.
2004లో ఓపీఎస్‌ రద్దుచేసి సీపీఎస్‌ తీసుకువచ్చార ని, దీంతో రిటైర్మెంట్‌ తర్వాత ఉపాధ్యాయుల బతుకు అగమ్య గోచరంగా మారిందని అన్నారు. సీఎం ఒక్కసారి కూడా విద్య మీద సమీక్ష జరిపిన పాపాన పోలేదని ఆం దోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని మార్చివేసే ప్రణాళికలో భాగంగా జాతీయ నూతన విద్యా విధానం 2020 తీసుకొచ్చిందని విమర్శిం చారు. పాఠ్యపుస్తకాల్లో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సామ్యవాదం అనే పదాలను, భగత్‌సింగ్‌, సారే జహాసే అచ్చా అనే అని రాసిన మహమ్మద్‌ ఇక్బాల్‌ రచనల ను పాఠ్యాంశాలను తొలగించారని విమర్శించారు. ఉపా ధ్యాయ ఐక్య పోరాట కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు అనుసరిస్తున్న విద్య, ఉపాధ్యాయ వ్యతిరేక విధా నాలను తిప్పి కొట్టడం కోసం సెప్టెంబర్‌ 1న హైదరాబా ద్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ధర్నాలో ప్రధానంగా సీపీఎస్‌ రద్దు ఓపీఎస్‌ పునరుద్ధరణ, ఐఆర్‌ ప్రకటించాలని నూతన విద్యా విధానం రద్దు చేయా లని, ప్రధాన డిమాండ్లతో 16 సంఘాలతో కూడిన యూ ఎస్‌పీసీ ఆధ్వర్యంలో 30 డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా చేస్తున్నామని తెలిపారు. సంఘాలకు అతీతంగా ఉ పాధ్యాయులు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీటీఎఫ్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జి.చంద్రారెడ్డి, బహుజన ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు యాదగిరి రామలింగం, టీఎస్‌ యూ టీఎఫ్‌ కార్యదర్శి ఇ.గాలయ్య, టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు కే.గోపాల్‌నాయక్‌, ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, సీనియర్‌ నాయకులు విజయలక్ష్మి జిల్లా కార్యదర్శి బి.భువ నేశ్వరి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇమ్మాని యేల్‌, ఎం.సురేష్‌, కార్యదర్శి కే.శ్రీనివాసులు హెచ్‌ఎం కమల్‌ సింగ్‌, ఉపాధ్యాయులు బాల్‌రాజ్‌, రాములు, తదితరులు పాల్గొన్నారు.ను. మొక్కజొన్న విత్తనాలు భూమిలో నుండే కత్తెర పు రుగు రోగాలతో మొలకెత్తడంతో మందుల పిచికా రికే అధిక ఖర్చు అయింది. రెండుసార్లు కలుపు మరింతా భారమైంది. ప్రతీ సంవత్సరం అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, కలుపు నివారణ వంటి ఖర్చులతోపాటు పంటకోత ఖర్చులు తలకు మించిన భారం అవుతుంది.
– చిట్టేల మల్లేశం, రైతు