ఫీల్‌ గుడ్‌ సినిమా

తేజ్‌ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో సాయిరత్న క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మాధవే మధుసూదన’. బొమ్మదేవర రామచంద్రరావు దర్శక, నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్‌ నెం2గా ప్రారంభమైన ఈ చిత్ర పూజా కార్యక్రమానికి హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా విచ్చేసి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. అలాగే లేటెస్ట్‌గా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మొదటి పాటను ఆవిష్కరించడం విశేషం.ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ,’సినిమా నుంచి ‘అలాంటి అందం..’ సాంగ్‌ చూశా. చాలా చాలా బాగుంది. తేజ్‌కి కంగ్రాట్యులేషన్స్‌. తన డాన్స్‌, యాక్టింగ్‌ చాలా బావుంది. అలాగే కథానాయిక రిషిక చాలా బాగా నటించింది. దర్శకుడిగా చంద్ర ఇంత బాగా హ్యాండిల్‌ చేస్తారని అనుకోలేదు. మంచి ఫీల్‌ ఉన్న ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవ్వాలి. వికాస్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ఈ ఆల్బమ్‌లోని మూడు పాటలు విన్నాను. మూడు చాలా బావున్నాయి, కొరియో గ్రాఫర్స్‌ రాజు మాస్టర్‌, రఘు మాస్టర్‌, మాస్టర్‌ ముగ్గురు చాలా బాగా చేశారు. పాటలు ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా రిలీజ్‌ అవుతున్నాయి. మిగిలిన పాటలూ త్వరలోనే విడుదలవుతాయి. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’ అని చెప్పారు.