
న్యాయస్థానం బార్ అసోసియేషన్ లో అధ్యక్షుడి సరసం చిన్న రెడ్డి అధ్యక్షతన న్యాయమూర్తులు శ్రీమతి నసీం సుల్తాన వేముల దీప్తి అధ్వర్యంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సిరికొండ మండల వాస్తవ్యురాలు కూమరి మాలవత్ పూర్ణ కోర్టుకు విచ్చేసిన సందర్భంగా సోమవారం ఆమెకు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అశోక్ ట్రెజరర్ అరుణ్ గ్రంథాలయ కార్యదర్శి తుమ్మ సుకేష్ సీనియర్ న్యాయవాదులు తులసి దాస్ పండిత్ ఏలేటి గంగాధర్ కిష్టయ్య నర్సయ్య , మోహన్ కోండ్ర కృష్ణంరాజు ఆవారి రమేష్, జూనియర్ న్యాయవాదుల రాజేందర్, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.