– మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోరు కుమార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్ర మాలను వేగవంతం చేస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోరుకుమార్ అన్నారు. సోమ వారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వాతంత్ర వజ్రో త్సవ ముగింపు వేడుకలు, తెలంగా ణకు హరితహారం, ఆసరా ఫించన్ , గొర్రెల పంపిణీ, బీసీ, మైనారి టీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం, గహలక్ష్మి, దళిత బంధు, ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, కారుణ్య నియామకాలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబదీ ్ధకరణ వంటి పలు అంశాలపై జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశా రు. అనంతరం జిల్లా కలెక్టర్ అమో రు కుమార్ మాట్లాడుతూ ప్రభు త్వ సూచనలు, సలహాలను పాటి స్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యక్ర మాలు ఎప్పటికప్పుడు అమలు పరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభిద్ధి సంక్షేమ పథకాలు జిల్లాలో 100 శాతం లక్ష్యం సాధించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణకు హరిత హారంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటినట్టు తెలిపారు. రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని సైతం విజయవంతం చేసినట్టు చెప్పారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై మాట్లాడు తూ.. లక్ష్యం మేరకు గొర్రెలు సేకరించి పంపిణీని చేస్తామన్నా రు. బీసీ, మైనారిటీ సంక్షేమ పథకాలు జిల్లాలో లబ్దిదా రులను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎంపిక చేస్తున్నామ ని తెలిపారు. ఇప్పటికే లక్ష్యం మేరకు పరిపాలన మంజూరు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. గహలక్ష్మి పధకం కింద వచ్చిన దరఖాస్తుల ను పరిశీలించి అర్హులై న వారి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో కారుణ్య నియా మకాలను పూర్తి చేసినట్టు చెప్పా రు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.