ఐడిఎఫ్‌సి ఎంఎఫ్‌ ఇక బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌

ముంబయి: ఐడిఎఫ్‌సి మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా బంధన్‌ మ్యూచు వల్‌ ఫండ్‌గా పేరు మార్చుకుంది. మార్చి 13 నుంచి కొత్త పేరుతో కనిపించ నుంది. తదనుగుణంగా ఈ ఫండ్‌ హౌస్‌ ప్రతి పథకానికి ఐడిఎఫ్‌ సి పదానికి బదులుగా బంధన్‌ పదం కనిపించనుందని ఆ సంస్థ వెల్లడిం చింది. పెట్టుబడుల వ్యూహాలు, ప్రక్రియలు, బందం మాత్రం అదే కొనసాగు తుందని పేర్కొంది. మదుపరులు, అదే తరహా అత్యున్నత నాణ్యత కలిగి పెట్టుబడుల విధానంతో ప్రయోజనం పొందగలరని ఎఎంసి సిఇఒ విశాల్‌ కపూర్‌ పేర్కొన్నారు. రీ బ్రాండింగ్‌ పేరు, లోగో మారనుందన్నారు. బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈ ఫండ్‌ హౌస్‌ ప్రయాణంలో నూతన అధ్యాయానికి ప్రతీకగా నిలువడంతో పాటుగా తమ వ్యాపారాలకు నూతన శక్తిని తీసుకు రానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.