– అసీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు
నవతెలంగాణ -భువనగిరి రూరల్
భవనిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు డిమాండ్ చేశారు.. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, జిల్లా అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అతి పెద్ద రంగమైన భవనిర్మాంగం పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని, ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికుల పట్ల సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విధంగా లక్ష బైకులు ఇవ్వాలని, నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మాయ కష్ణ బల్దింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గొరిగి సోములు రాష్ట్ర కమిటీ సభ్యులు కూరెల్ల నరసింహ, నాయకులు ఎస్ కే శ్రీనివాస్, శ్రీశైలం, వెంకటేశం, మారయ్య, నరసింహ ,శివకుమార్, సోమ నరసింహ పాల్గొన్నారు.