అన్ని రంగాల్లోనూ తెలంగాణ అభివృద్ధి

– శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ -చిట్యాల
తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివద్ధి చెందిందని. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన దక్షతతో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి , ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో అంగన్‌ వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం వెంబాయి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, 3లక్షలతో నిర్మించనున్న బస్‌ షెల్టర్‌ నిర్మాణ పనులకు , ఎలికట్టె గ్రామంలో15లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు, నేరేడ ఆవాస గ్రామమైన గాడిరెడ్డిపల్లిలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజస్థాన్‌ రాష్ట్రంలో జరిగిన అల్‌ ఇండియా స్పీకర్లు చైర్మెన్ల సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, అభివద్ధి కార్యక్రమాల గురించి వివరించానని మిగతా రాష్ట్రాల వారు చాలా ఆశ్చర్యానికి గురైనారని తెలిపారు.ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివద్ధి కార్యక్రమాలను ఎలా అమలు చేయగలుగుతున్నారని వారు అడిగారని చెప్పారు.44 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తా వెంకట్‌ రెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మెన్‌ గుత్తా అమిత్‌ రెడ్డి , ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ సుంకరి ధనమ్మ, ఎంపీపీ కొలను సునిత వెంకటేష్‌ గౌడ్‌,ఎంపిటిసిలు, సర్పంచ్‌ లు ,స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు.