– కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో 50వేల మెజార్టీతో విజయం సాధిస్తాం
– 70 సీట్లతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి..
– నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
రాష్ట్రంలో బీఆర్ఎస్,బీజేపీలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం పట్టణంలోని గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు 50వేల ఓట్లకు ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు.కోదాడ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ల్యాండు,సాండ్, మైన్స్,వైన్స్ అక్రమ వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిచారని ఆరోపించారు.తమకు పిల్లలు లేరని రెండు నియోజకవర్గాల ప్రజలు తమకు పిల్లలతో సమానమని వెల్లడించారు.కోదాడ నుండి పద్మావతి,హుజూర్నగర్ నుండి తాను కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నామన్నారు.70 సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికల హామీలు విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు ఓటమి భయంతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై దుష్ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు .ఎన్ ఎస్.యూఐ రాష్ట్ర అధ్యక్షులు బలుమూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనరెడ్డిలు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పతనానికి దగ్గరకు వచ్చిందని ఎద్దేవా చేశారు.దేశంలో మోడీ జీఎస్టీ టాక్స్ విధిస్తే కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బీయంవై టాక్స్( బొల్లంమల్లయ్య యాదవ్ టాక్స్) విధించారని ఘాటుగా విమర్శించారు.కోదాడ నియోజకవర్గంలో ప్రతి వ్యాపారంలోనూ, ప్రతి పథకంలోనూ అవినీతి రాజ్యమేలుతుందన్నారు.గంజాయి రవాణా చేస్తూ బీఆర్ఎస్ నాయకులు యువతను పెడదోవ పట్టించారని విమర్శించారు.కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందన్నారు.అంతకుముందు కాగా కోదాడ పట్టణంలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో వందలాదిమంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు.జై కాంగ్రెస్ జై ఉత్తమ్ అంటూ నినాదాలతో కోదాడ మారుమోగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతి,నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి,తూమాటి వరప్రసాద్‌రెడ్డి, డేగ శ్రీధర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి ఎజాజ్, యిర్ల సీతారామిరెడ్డి,ఎంపీటీసీ హిమబిందు సుమన్‌రెడ్డి, వంగవీటిరామారావు, రజనీకాంత్,గంధం యాదగిరి, పార సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.