
నవతెలంగాణ – సిద్దిపేట
హాకి మాంత్రికుడు, హాకీ పితామహుడు, ఒలంపిక్స్ లో మన దేశానికి స్వర్ణ పథకాలు తెచ్చిన ధ్యాన్ చందు ను క్రీడాకారులు ఆదర్శంగా తీసుకొని, తమకు ఇష్టమైన క్రీడలో ఎదగాలని స్ఫూర్తి లయన్స్ క్లబ్ అధ్యక్షులు సామల సత్యనారాయణ సూచించారు. ధ్యాన్ చందు జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఖెలో ఇండియా సైక్లింగ్ సెంటర్ లో మంగళవారం రాష్ట్రస్థాయి జాతీయస్థాయికి ఎంపికైన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. కేలో ఇండియాలో సైకిలింగ్ లో శిక్షణ పొందుతు, జాతీయ స్థాయికి ఎంపిక కాబడిన హంసి, శ్రీ హరిణి, హర్షిత, రావలి, రిజ్వానా బేగం, కరీమున్నీసా, అంకిత, కావ్య, వర్షిని, సంతోష్, పవన్, హర్షవర్ధన్ సాయి, గరపెల్లి సుప్రీత్ లకు రిటైర్డ్ పిడి, హ్యాండ్ బాల్ కోచ్ కనకయ్య, సైక్లింగ్ కోచ్ సంజీవ్, స్ఫూర్తి లయన్స్ క్లబ్ డైరెక్టర్ లయన్ సోమ కైలాసపతి, లయన్ ఈశ్వర్ చరణ్ తో కలసి సత్యనారాయణ బహుమతులు, మెమొంటోస్, సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఎనర్జీ డ్రింక్, బిస్కెట్స్ ను స్ఫూర్తి లైన్స్ వారు క్రీడాకారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బండారుపల్లి శ్రీనివాస్, సెక్రెటరీ జంగాపల్లి వెంకట నరసయ్య, కాటం శ్రీనివాస్ , సుజాత, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ రామేశ్వర్ రెడ్డిలు సహకరించినందుకు కృతజ్ఞతలను సైక్లింగ్ కోచ్ సంజీవ్ తెలిపారు.