ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో మహిళ మృతి

నవ తెలంగాణ-బంజర హిల్స్
పంజాగుట్ట చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.బోరబండకు చెందిన రమ్య ఎర్రమంజిలోని ఓ సంస్థలో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తుందన్నారు.పంజాగుట్ట చౌరస్తాలో దిగిన ఆమె ఎర్ర మంజిల్ వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో జగదిరిగుట్ట నుంచి మెహిదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టిగానే తీవ్ర రక్తస్రావమైన ఆమె అక్కడికక్కడే మృతి చెందిందిదాని అన్నారు.రమ్యకు ఇద్దరు ఆడపిల్లలు,8 ఏళ్ళ బాబు ఉన్నారని మృతురాలి భర్త అనారోగ్యంతో ఇంటి వద్దే ఉంటున్నారని ఆమె కుటుంబ పోషణ మొత్తం రమ్యనే చూసుకుంటున్నారని పోస్టుమార్టం నిమిత్తం ఇంతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించాలని వెల్లడించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టుకున్నట్టు వెల్లడించారు.కాగా గుర్తురాలి బంధువులు దర్యాప్తులు విచారణలు పేరుతో జాప్యం చేయకుండా ఆడపిల్లలు ఉన్న కుటుంబనికి పోషణ భారం కాకుండా రమ్య కుటుంబానికి అండగా నిలబడి ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని బంధువులు వేడుకున్నారు.