– తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల డిమాండ్..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల ను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల ప్రతినిధులు సుందర్. నరేందర్. జ్యోత్స్న .శ్రీనివాస్ లు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అబిడ్స్ బుగ్గలకుంట లోని వై డబ్ల్యు సి ఎ హాల్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 2005 సంవత్సరంలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చారన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు. రెడియో గ్రాఫర్స్. ఫార్మసిస్ట్. స్టాఫ్ నర్స్. ఓటి టెక్నీషియన్లు. అనస్థీషియా టెక్నీషియన్లు. డాటా ఎంట్రీ ఆపరేటర్లు. ఈఈజీ. అప్నాలిక్ టెక్నీషియన్లు. నాలుగో తరగతి సిబ్బంది లను ప్రభుత్వం పర్మినెంట్ చేయాలన్నారు. ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తమ సమస్యలపై డిఎంఈ. డిహెచ్. టీవీ వీకమిషనర్. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ లను త్వరలోనే కలిసి తమ సమస్యలు వివరిస్తామని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే కార్యాచరణ రూపొందిస్తామన్నారు. బుధవారం నుండి ప్రభుత్వ ఆసుపత్రులలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ ఒక గంటపాటు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల ప్రతినిధులు సుందర్. జ్యోత్స్న. శ్రీనివాస్. సత్యం. రాజు. విజయలక్ష్మి. మౌనిక. సంధ్య. వినోద. లక్ష్మీ. కవిత. రామ లీల. రాకేష్. శ్రీధర్. రవీందర్ రెడ్డి. సత్యనారాయణను గౌడ్. కిరణ్ కుమార్. గణేష్. సంజీవ చారి. జ్యోతి. శోభ. నాగమణి. గోపాల్ రాఘవేందర్ పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు పాల్గొన్నారు