
– లైసెన్స్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి
– రాయపర్తి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
ప్రజాసేవ అనే భావానికి ప్రతిబింబంగా ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ నిలుస్తుందని రాయపర్తి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. మైలారం, పెర్కవేడు గ్రామాలకు చెందిన సుమారు 200 మంది వాహనదారులకు బుధవారం డ్రైవింగ్ లైసెన్స్ లెర్నింగ్ పత్రాలను పంపిణీ చేశారు. లైసెన్స్ మేళాకు వచ్చిన వారికి మధ్యాహ్నం భోజన సదుపాయాని కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనేదే ఎర్రబెల్లి ట్రస్ట్ లక్ష్యం అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ అనేది చట్టపరమైన అవసరం మాత్రమే కాదు అని ఒక బాధ్యత అన్నారు. మనిషి హడావిడి జీవన గమనంలో వాహనం లేనిదే ప్రయాణం ముందుకు సాగదు అలాంటిది వాహనాన్ని నడిపే డ్రైవర్ కు లైసెన్స్ అనేది అత్యంత కీలకం అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే యువత జిల్లా కేంద్రానికి వెళ్లి లైసెన్స్ పొందాలి అంటే కొంత ఖర్చు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోనే లైసెన్స్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క వాహనదారుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో
జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు గబ్బేట బాబు, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, మైలారం సర్పంచ్ లేతకుల సుమతి యాదవ రెడ్డి, ఎంపీటీసీ గాడిపెల్లి వెంకన్న, పీఏసీఎస్ డైరెక్టర్ గబ్బేట యాకయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పరుపాటి రవీందర్ రెడ్డి, నాగపూరి సోమయ్య, భాషబోయిన సుధాకర్, ఫ్రొగ్రాం ఇంఛార్జీలు ఆశ్రఫ్ పాషా, సంకినేని ఎల్లస్వామి, సత్తూరి నాగరాజు, గారే కిరణ్ తదితరులు పాల్గొన్నారు.