పారదర్శక ఓటరు జాబితా కు సహకరించాలి..

– విధులు పట్ల బి.ఎల్.ఒ అప్రమత్తంగా ఉండాలి..

– నియోజక వర్గ ఎన్నికల అధికారి రాంబాబు.
నవతెలంగాణ – అశ్వారావుపేట
పారదర్శక ఓటర్లు జాబితా నమోదుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని నియోజక వర్గం ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ పి.రాంబాబు నాయకులను కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ గడువు దగ్గర పడుతున్నా దృష్ట్యా ఎన్నికల కమీషన్  ప్రక్రియను వేగవంతం చేస్తుందని అన్నారు.ఆయన బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో బి.ఎల్.ఒ లతో సమీక్ష జరిపారు.విధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆదేశించారు.బి.ఎల్.ఒ లకు అవసరం అయిన స్టేషనరీ సామాగ్రి బి.ఎల్.ఒ కిట్ లను అందజేసారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,ఎం.పి.డి.ఒ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.