వినూత్న కథ

సాయి ధన్సిక, విమలారామన్‌, గణేష్‌ వెంకట్రామన్‌ ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘అంతిమ తీర్పు’. శ్రీసిద్ధి వినాయక మూవీ మేకర్స్‌ పతాకంపై డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఎ.అభిరామ్‌ దర్శకుడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్‌ తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ‘వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. సాయిధన్సిక నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు.