
– తెలంగాణ రాష్ట్ర సర్కార్ ధ్యేయం..
– ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.
నవతెలంగాణ – డిచ్ పల్లి
నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, సంక్షేమంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయమే తెలంగాణ రాష్ట్ర సర్కార్ ధ్యేయమని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం ఇందల్ వాయి మండలంలోని అన్సన్ పల్లి ముదిరాజ్ సంఘానికి రూ ₹ 5 లక్షలు, మందుల సంఘానికి ₹ రూ 3 లక్షల రూపాయలు, ముస్కలిం కమ్యూనిటీ హాల్ కు రూ .₹ 5 లక్షలు, కబ్రాస్తాన్ కాంపౌండ్ వాల్ కు రూ .₹ 5 లక్షలు విలువ గల ప్రొసీడింగ్ పత్రాలను కుల సంఘ సభ్యులకు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్ని కులాల వారికి ప్రభుత్వ సమన్యాయం చేస్తుంది,సంక్షేమంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం సమన్యాయం చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి వివిధ కుల సంఘాలకు16 కోట్లు మంజూరు అయ్యాయని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తోపాటు వివిధ కుల సంఘాలకు ₹16 కోట్లు మంజూరు అయ్యాయని ఆయన వెల్లడించారు. ఎంపీ తన ఎంపీ లాండ్స్ నిధుల నుండి, వారి తండ్రి నిధులు మొత్తం కలిపి ఐదు సంవత్సరాలకు 50 కోట్ల నిధులు, ఏ గ్రామానికి ఇచ్చారో ప్రజలు అడగాలని సూచించారు. ఎంపీ నిధులను కాంట్రాక్ట్ పరంగా కమిషన్లకు అమ్ముకుంటూ కాలమెల్లదీస్తున్న ఎంపీకి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, గ్రామాలకు, వస్తు దొంగ హామీలు ఇస్తున్నారని, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని, ముఖ్యంగా గ్రామ ప్రజలు గమనించాలని వారు వేస్తే తమ గ్రామాలకు ఏం చేశారని ప్రతిపక్ష నాయకులను నిలదీయాలని ఆయన సూచించారు.అక్కా-తమ్ముడు, అన్నా-చెల్లెలు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ, ఆడబిడ్డలు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ శుబాకాక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ సినియర్ నాయకులు తటిపాముల శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ రాజేశ్వర్, ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు రఘునథన్ రాము, టిఆర్ఎస్ గ్రామ శాఖ సంతోష్, గంగాధర్, రాజేందర్, లింగం, సాయిలు, అశ్రాఫ్, మహమ్మదుల్లా, అజిత్, ఇస్మాయిల్ రహీం, తదితరులు పాల్గొన్నారు.