నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర మీడియా కన్వీనర్‌గా డాక్టర్ కిరణ్ మాదాల నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బీ.ఎన్.రావు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ పి.కాళీ ప్రసాద్ రావు, గౌరవ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జె.విజయరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాదాల మాట్లాడుతూ, తనకు అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తానని తెలిపారు. తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.