ఓ తండ్రి..భావోద్వేగ ప్రయాణం

హీరో నాని నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి (సివిఎం), డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తోంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని కూతురుగా బేబీ కియారా ఖన్నా కనిపించనుంది. తాజాగా ఈ చిత్ర నూతన షూటింగ్‌ షెడ్యూల్‌ కూనూర్‌లోని పచ్చని అందమైన లొకేషన్స్‌లో ప్రారంభమైంది. ‘హారు నాన్న’ మ్యూజికల్‌ ఫెస్ట్‌ కోసం త్వరలోనే మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ ప్రారంభం కానున్నాయి. ‘నాని కెరీర్‌లోనే ఇదొక డిఫరెంట్‌ సినిమా. ఓ తండ్రి.. భావోద్వేగ ప్రయాణం ఆద్యంతం అలరిస్తుంది. డిసెంబర్‌ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తునట్టు మేకర్స్‌ తెలిపారు.