పాత ఇంజన్ల కోసం మొబిల్‌ డెల్వక్‌ ఆయిల్‌

న్యూఢిల్లీ: ట్రక్కర్లకు మంచి నాణ్యత గల ఇంజన్‌ ఆయిల్‌ను ఎంపిక చేసుకోవటంలో సహాయపడటానికి మొబిల్‌ కొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ‘ట్రక్కింగ్‌ కష్టం.. ఇంజిన్‌ ఆయిల్‌ ఎంపిక చేయటం కాదు’ అనే నినాధంతో ప్రచారం సాగనున్నట్లు పేర్కొంది. ట్రక్కులు వాటి వయస్సును బట్టి ఇంజనాయిల్‌ను సులభతరం చేయడంలో సహాయపడనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం మొబిల్‌ డెల్వక్‌ను ఆవిష్కరించినట్లు తెలిపింది. దీన్ని పాత ఇంజన్‌ల కోసం డిజైన్‌ చేసినట్లు పేర్కొంది. దీంతో ఇంజన్‌ జీవితకాలం పెరగనుందని తెలిపింది.